హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అప్పుడే వద్దు: అంజన్, ముఖేష్‌ల వివాదంపై బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: పార్లమెంటు సభ్యులు, మంత్రులు, శాసనసభ్యుల సీట్ల గొడవపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం స్పందించారు. ఎన్నికల వరకు పోటీపై ఎవరూ ఎలాంటి ప్రకటనలు చేయవద్దని ఆయన పార్టీ నేతలను కోరారు. ఎన్నికలకు మరో రెండేళ్లకు పైగా సమయం ఉన్నందున ఇప్పుడే పోటీపై ప్రకటనలు చేయవద్దని అన్నారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం సరికాదని ఆయన అన్నారు. కాగా కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలతో బొత్స, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. నేతల ప్రచారం తదితర అంశాలపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. మంత్రి టిజి వెంకటేష్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. తాను కొవ్వూరులో ప్రచారం చేస్తానని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ముందుకు వెళుతుందన్నారు.

కాగా గత రెండు రోజులుగా గ్రేటర్ కాంగ్రెసులో పార్లమెంటు చిచ్చు రాజుకున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తాను సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని తన తనయుడు గోషా మహల్ నుండి పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ప్రస్తుత ఎంపి అంజన్ కుమార్ యాదవ్ ధీటుగా స్పందించారు. తన నియోజకవర్గంపై కన్నేస్తే అడ్డంగా నరికేస్తానని హెచ్చరించారు. ఇద్దరి మధ్య పరోక్ష యుద్ధం నడిచింది. మరోవైపు కాంగ్రెసు ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి తాము వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమని చెప్పారు. మరో ఎమ్మెల్యే బండారు రాజి రెడ్డి కూడా ఎంపి సర్వే సత్యనారాయణపై ధ్వజమెత్తారు. దీంతో గ్రేటర్ కాంగ్రెసులో చిచ్చు రాజుకుంది. ఈ అంశంపై బొత్స గురువారం స్పందిస్తూ ఎవరూ ఎలాంటి ప్రకటనలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

English summary
PCC chief Botsa Satyanarayana responded minister Mukesh Goud and MP Anjan Kumar Yadav issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X