జగనా, చంద్రబాబా ఇప్పుడే చెప్పలేం: అఖిలేష్ యాదవ్

దేశాభివృద్ధికి కాంగ్రెసు, బిజెపియేతర కూటమి ఏర్పడాల్సి ఉందని ఆయన అన్నారు. ఆ ప్రంట్ ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు. ఇప్పటికిప్పుడు జాతీయ స్థాయిలో తృతీయ ఫ్రంట్ గురించి మాట్లాడడం తొందరపాటే అవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ విభజనకు ఆయన వ్యతిరేకంగా ప్రతిస్పందించారు. ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా విభజించాలనే డిమాండ్ ఉందని, ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని అంటున్నారని, ఉత్తరప్రదేశ్‌ను విభజించాలనే మాయావతి ప్రతిపాదనను ప్రజలు తిరస్కరించారని, పెద్ద రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు.
తాము ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సి ఉందని, వాటిని అమలు చేయకపోతే ప్రజలు శిక్ష వేస్తారని ఆయన అన్నారు. రాహుల్ ఉత్తరప్రదేశ్‌లో చాలా శ్రమించారని, ప్రజలకు కలలు చూపించారని, అయితే రాహుల్ గాంధీని ప్రజలు విశ్వసించలేదని ఆయన అన్నారు.