నేనొచ్చానని సిఎం రాకపోవచ్చు, నామోషీ వద్దు: జగన్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాదులో ఉండి కూడా పరామర్శకు రాలేక పోయారన్నారు. అందుకు నేను బాధపడుతున్నానని అన్నారు. నా స్థానంలో ఆయన వచ్చి ఉంటే బాగుండేదన్నారు. ఇప్పటికైనా పరిస్థితి గమనించి ఆయన రావాలని అన్నారు. జగన్ వచ్చాడని, మరెవరో వచ్చారని ఆయన రాకుండా ఉండకూడదన్నారు. ఇక్కడకు వచ్చి బాధితులకు తానున్నానని భరోసా కల్పించాలన్నారు. జగన్ వచ్చాడని నామోషిగా ఫీల్ కాకుండా స్పందించాలన్నారు. బాధితులకు ఆర్థిక సహాయం వెంటనే ప్రకటించాలన్నారు. ఐదు నెలల్లో బాధితులకు పక్కా ఇల్లు కట్టించాలన్నారు.
కాగా ఈ ప్రమాదంలో సుమారు ఆరు వందలకు పైగా గుడిసెలు కాలి పోయాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఓ బాలిక సజీవ దహనం కాగా మరో బాలిక తీవ్రంగా గాయపడింది. మృతి చెందిన బాలిక కుటుంబానికు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా, బాధితులకు తక్షణ సహాయం అందించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ డిమాండ్ చేసింది.












Click it and Unblock the Notifications