కెసిఆర్ తప్పు చేశారు, ఏదో తేలిపోయి ఉండేది: డిఎస్

త్యాగాల పేరుతో రాజీనామాలు చేయడం తెరాసకు ఫ్యాషన్‌గా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ తెరాస సొత్తు కాదని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు డిపాజిట్లు రాకపోతే తెలంగాణ వస్తుందని కెసిఆర్ అన్నారని, 2010లో తెలంగాణ ఎందుకు రాలేదని ఆయన అన్నారు. తెరాస ఆరు చోట్ల గెలిచినా తెలంగాణ రాదని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో తాము మెజారిటీ సీట్లు గెలుస్తామని ఆయన దీమా వ్యక్తం చేశారు.
గతంలో తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉండేదని, తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలను ప్రజలు గ్రామాల్లోకి రానీయలేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, ఈ రెండు పార్టీలు కూడా గ్రామాల్లో ప్రచారం సాగించగలుగుతున్నాయని ఆయన అన్నారు.