ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్, పదిహేనుమంది మావోల మృతి

ఈ ఘటనలో ముగ్గురు కోబ్రా జవాన్లు గాయపడ్డారు. దీంతో బస్తర్ ఐజీ లాంకుమేర్, ఎడిసి రాంనివాస్ నేతృత్వంలో మరిన్ని బలగాలు శనివారం నుంచి భారీగా కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలోనే శనివారం అబూజ్‌మడ్ సమీపంలో మావోయిస్టులపై కోబ్రా దళాలు దాడి జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో 15 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే కేంద్రం సమీప రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. సరిహద్దులో బలగాలను మో హరించాలని సూచించింది. అబూజ్‌మాడ్ ప్రాంతంలో సరైన సమాచార వ్యవస్థ లేనందున అక్కడి విషయాలను పోలీసులు సైతం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కూంబింగ్‌కు వెళ్లిన బలగాలు తిరిగి వస్తేనే అసలు వివరాలు తెలిసే అవకాశముంది.












Click it and Unblock the Notifications