ప్రభుత్వాన్ని కాపాడుతుంది ఎవరు?: ఎంఐఎంపై టిడిపి

చంద్రబాబు మాట్లాడుతుండగా ఎంఐఎం కార్నర్ చేస్తోందన్నారు. ప్రభుత్వ ఒత్తిడి మేరకే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోందని ఆరోపించారు. సమస్యల నుండి తప్పించుకోవడానికి ప్రభుత్వం సభను వాయిదాలు వేయిస్తోందన్నారు. 26 జివోలకు సుప్రీం కోర్టు నుండి నోటీసుల అంశంపై ఆరో రోజు కూడా ప్రభుత్వం చర్చించకుండానే వెళ్లి పోయిందన్నారు. బాబుకు నిరసన చెప్పే అవకాశమే దొరకలేదన్నారు. 2004 నుంచి కాంగ్రెసు అవినీతిపై తాము పోరాడుతున్నామన్నారు. అప్పుడు అక్బరుద్దీన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. వివాదాస్పద ఫైళ్లు స్పీకర్ ముందు పెట్టాలని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications