చిరు స్టార్ కాంపెయినర్, కెకె తీరు వల్లే రాలేదు: బొత్స

Botsa Satyanarayana
హైదరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి దక్షిణ భారత దేశంలో కాంగ్రెసు పార్టీకి ఉపయోగపడతారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంగళవారం అన్నారు. సిఎల్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పార్టీలో చాలా సీనియర్ నేత అని చెప్పారు. తమ పార్టీ నుండి 1996 తర్వాత ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి వర్గానికి రాజ్యసభ సీటు ఇవ్వలేదని, ఇప్పుడు రేణుకకు ఇచ్చారన్నారు. నమ్ముకున్న వారిని కాంగ్రెసు ఎప్పుడూ విస్మరించ లేదనేందుకు రాపోలు ఆనంద భాస్కర్ ఎంపిక నిదర్శనమన్నారు. ఆయన చేనేత వర్గానికి చెందిన వ్యక్తి అన్నారు. చిరంజీవి సామాజిక న్యాయం కోసం ప్రజారాజ్యం పార్టీని స్థాపించారని, అదే సామాజిక న్యాయం కోసం తన పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేశారన్నారు. చిరంజీవి కాంగ్రెసుకు స్టార్ కంపెయినర్ అని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదన్నారు. దక్షిణ భారత్‌లో ఆయన మాకు ఉపయోగపడతారన్నారు.

తెల్ల కార్డులు ఉన్న వారికి మద్యం దుకాణాలు ఉన్నాయని ఇటీవల ఓ పేపర్లో వచ్చిందని బొత్స సత్తిబాబు ఈ సందర్భంగా అన్నారు. అందుకే మద్యం దుకాణాలు ఉన్న వారికి తెల్ల రేషన్ కార్డులు ఉంటే రద్దు చేయాలని తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశానని చెప్పారు. కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు కె కేశవ రావుకు రాజ్యసభ ఇవ్వాలని మేం అధిష్టానాన్ని కోరామని చెప్పారు. అయితే తెలంగాణ విషయంలో ఆయన వ్యవహార శైలి వల్లే టిక్కెట్ రాలేదని భావిస్తున్నట్లు బొత్స సత్యనారాయణ చెప్పారు. కాగా చిరంజీవి, రేణుకా చౌదరి, రాపోలు ఆనంద భాస్కర్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డిలు సోమవారం రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు విషయంలో తాము ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. జివోల విషయంలో ఎవరూ తప్పు చేయలేదన్నారు. తెర వెనుక జరిగే లాలూచీలతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. జగన్ వర్గం నేతల ఖాళీతో ఏర్పడిన పదిహేడు నియోజకవర్గాలతో పాటు తిరుపతి స్థానానికి త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలను అమ్ముకుందని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+