జగన్‌కేసు:సిబిఐ ఎదుట సాక్షి ప్రతినిధి, ప్రకటనలపై ఆరా

ప్రకటనల నిడివి, ఎంత ఖర్చుతో జారీ చేశారన్న విషయాలపై సిబిఐ అధికారులు ఆరా తీశారని సమాచారం. దీనిపై ఇప్పటికే సమాచార పౌరసంబంధాల మాజీ కమిషనర్, ఐఏఎస్ అధికారి పార్థసారధితో పాటు ఆ శాఖ డైరెక్టర్లను కూడా సిబిఐ ప్రశ్నించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రకటల్ని జారీ చేసేందుకు ఎవరు ఒత్తిడి తెచ్చారన్న విషయాన్ని అధికారులు ఆ శాఖ అధికారులను ప్రశ్నించారు. కాగా సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ సోమవారం న్యూఢిల్లీలో సిబిఐ డైరెక్టర్ ఎపి సింగ్‌తో భేటీ అయి జగన్ కేసులో పురోగతిని వివరించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications