కుక్కను కొట్టాడని ఓ యువకుడిని కాల్చి చంపారు

పోలీసుల కథనం ప్రకారం - పక్క పక్కన ఇళ్లు గల దుర్గమ్మ, అమృత, నర్సింలకు చెందిన కుక్క గుడుపల్లి మల్లేశం (19) అనే వ్యక్తి ఇంటిలోని వెళ్లి అక్కడున్న బకెట్‌లో నీరు తాగింది. దీంతో ఆగ్రహించిన మల్లేశం కుక్కను కొట్టాడు. ఇది గమనించిన దుర్గమ్మ, అమృత, నర్సింలు మల్లేశం అతన్ని కొట్టారు. దాంతో ఆగకుండా అతనిపై కిరోసిన్ పోసి తగులబెట్టారు.
బాధితుడు గత నాలుగు రోజులుగా సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాసను విడిచాడు. సంగారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీన మృతును కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications