మిత్రురాలి ఇంటి టెర్రాస్‌పై నుంచి పడి టెక్కీ మృతి

పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం - స్నేహితురాలు ఓ పార్టీకి వెళ్లి తిరిగి వచ్చే సరికి సౌరవ్ మద్యం సేవిస్తున్నాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో ఆమె కిందికి దిగి వస్తుండగా పైనుంచి కిందికి ఏదో పడిన శబ్దం వినిపించింది. చూసేసరికి సౌరవ్ రక్తం మడుగులో పడి ఉన్నాడు.
స్థానికులు చూసి అంబులెన్స్ కోసం ఫోన్ చేశారు. అయితే అది రాలేదు. దీంతో సౌరవ్ స్నేహితురాలు నోయిడాలోని తనకు తెలిసిన ఫ్రెండ్‌ను పిలిచింది. ఆదివారం పదిన్నర గంటలకు సంఘటన జరిగితే అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటకు తమకు విషయం చెప్పారని పోలీసులు అంటున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications