హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజకీయాల్లో ఎందుకున్నానా!?: బొత్స మనస్థాపం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: విజయనగరం జిల్లాలో మద్యం సిండికేట్లపై ఎసిబి వ్యవహరించిన తీరు తనకు తీవ్ర మనస్థాపం కలిగించిందని, రాజకీయాల్లో ఎందుకు ఉన్నానా అని అనిపించిందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం అన్నారు. ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి వాటి గురించి తాను స్పందించనని, అన్నింటికి సరైన సమయం వస్తుందని ఆయన అన్నారు. అప్పుడే తాను మాట్లాడతానని చెప్పారు.

కాగా విజయనగరం మద్యం సిండికేట్ల విషయంలో ఎసిబి తీరుపై బొత్స తీవ్ర మనస్తాపం చెందినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై తన సన్నిహితుల వద్ద తీవ్రంగా వాపోయారని తెలుస్తోంది. తాను దేవుడిని నమ్ముకున్నానని ఆయనే అన్ని చూసుకుంటారని అన్నట్లుగా తెలుస్తోంది. పైకి కఠినంగా కనిపించినప్పటికీ నాది చాలా సున్నితమైన మనసు అని చెప్పారని తెలుస్తోంది. తనను టార్గెట్ చేసిన విషయం అందరికీ తెలుసునని అన్నారట. ఎసిబి శ్రీనివాస్ రిపోర్ట్ తనకు బాధ కలిగించిందన్నారు.

ఎసిబి లీగల్ నోటీసులు చూశాక రాజకీయాలు ఇలా కూడా ఉంటాయా అని ఆయన తీవ్ర ఆవేదన చెందారని అంటున్నారు. ఈ విషయంపై తాను అధిష్టానానికి ఫిర్యాదు చేయలేదని, కాలమే సమాధానం చెబుతుందని అన్నారని తెలుస్తోంది. అంతా అధిష్టానం చూసుకుంటుందని ఆయన చెప్పారని తెలుస్తోంది. ఈ నెల 8వ తేదిన బొత్స విశాఖపట్నం జిల్లాలోని పాయకరావుపేటలో పర్యటిస్తున్నట్లు చెప్పారు.

ఏప్రిల్ ఆరవ తేదిన నర్సన్నపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు బొత్స చెప్పారు. ఈ నెల నాలుగున ఢిల్లీ వెళ్తున్నామని తెలిపారు. కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణను లక్ష్యంగా చేసుకున్నారనే వాదనలు ఉన్న విషయం తెలిసిందే. వీరి మధ్య ఉన్న విభేదాలు అధిష్టానాన్ని కూడా కలవరపరుస్తోంది. దీంతో వీరికి అధిష్టానం నుండి పిలుపు వచ్చింది.

English summary
PCC chief Botsa Satyanarayana was surprised at politics. He said that he don't talk about like this politics because he is in government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X