వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న సునీల్‌ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sunil Reddy
హైదరాబాద్: ఎమ్మార్ కేసులో నిందితుడు సునీల్ రెడ్డి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో వేసిన బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. సోమవారం ఆయన తన బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్నారు. ఛార్జీషీట్ దాఖలు చేసిన తర్వాత బెయిల్ ఇవ్వాలని సునీల్ రెడ్డి తరఫు న్యాయవాదులు హైకోర్టును అభ్యర్థించారు. ఈ కారణంగా వారు సునీల్ రెడ్డి పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.

మరోవైపు సునీల్ రెడ్డి బ్యాంకు లావాదేవీల నివేదికను సిబిఐ హైకోర్టుకు సమర్పించింది. విల్లాల నుంచి వసూలు చేసిన రూ.63 కోట్ల సౌత్ ఎండ్ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టినట్లు సిబిఐ కోర్టుకు విన్నవించింది. ఒక్క యాక్సిస్ బ్యాంకు ద్వారానే రూ.8 కోట్ల లావాదేవీలు జరిగాయని సిబిఐ హైకోర్టుకు తెలిపింది.

కాగా ఎమ్మార్ కుంభకోణంలో అరెస్టయిన సునీల్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న విషయం తెలిసిందే. కోర్టు మొదట దానిని ఏప్రిల్ రెండవ తేదికి వాయిదా వేసింది. అనంతరం తొమ్మిదికి వాయిదా వేసింది. ఈ కేసులో సిబిఐకి కూడా అప్పుడు కోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించింది. దీంతో సిబిఐ సునీల్ రెడ్డి బెయిల్ పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేసింది.

కాగా తమపై విచారణ నిలిపివేయాలంటూ ఎసిబి కోర్టులో ఎపిఐఐసి మాజీ చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం వేసిన పిటిషన్‌ను ఎసిబి ప్రత్యేక కోర్టు కొట్టి వేసింది. శివరామ సుబ్రహ్మణ్యం ఇటీవలి వరకు ఎపిఐఐసి చైర్మన్‌గా పని చేసిన విషయం తెలిసిందే.

అయితే, ప్రత్యేక కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సిబిఐ హైకోర్టుకు వెళ్లింది. సిబిఐవాదనలు వినకుండా నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆచార్యకు బెయిల్ ఇవ్వడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు విచారణ జరుగుతుండగా ఆచార్యకు బెయిల్ ఇవ్వడం సరి కాదని అభిప్రాయపడింది.

English summary
EMAAR case accused Sunil Reddy withdrawed his bail petition on monday. His lawyers urged court to give bail after file chargesheet in this case by CBI. ACB court dismissed former APIIC chairman Sivarama Subrahmanyam petition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X