వైయస్ మహానేత కాదు, మహా దొంగ: చంద్రబాబు

Chandrababu Naidu
చిత్తూరు: వైయస్ రాజశేఖర రెడ్డి మహానేత కాదని, మహా దొంగ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఖ్యాతి గురించి మాట్లాడేవారు, అవినీతి గురించి కూడా మాట్లాడాలని ఆయన అన్నారు. చిత్తూరు జిల్లాలోని నియోజకవర్గాల్లో ఆయన బుధవారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. రాయచోటిలో ఆయన మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సెజ్‌ల కోసం రైతుల నుంచి లాక్కున్న భూములను తిరిగి వారికి ఇచ్చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎవరబ్బసొమ్మని వేల ఎకరాల భూములను దోచిపెట్టారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది తమ పార్టీయేనని, దోచుకోవాలని, దాచుకోవాలని తాము ఎప్పుడూ అనుకోలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు పెట్టింది తమ పార్టీయేనని ఆయన చెప్పుకున్నారు. మైనారిటీలకు, వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యత ఇచ్చింది కూడా తామేనని ఆయన అన్నారు. అప్పుడు వైయస్సార్ దోచుకున్నారని, ఇప్పుడు జగన్ వస్తున్నాడని, తండ్రిని అడ్డుం పెట్టుకుని లక్ష కోట్లు దోచుకున్నారని ఆయన విమర్శించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసినవారి కుమారులు ఇలాగే దోచుకున్నారా అంటూ ప్రశ్నించారు.

దివంగిత ఎన్టీఆర్‌కు కుమారులు ఉన్నారు, వారు దోచుకున్నారా ఆయన అడిగారు. తండ్రి వైయస్సార్ మరణించినప్పుడు అందరూ దుంఖంలో ఉంటే జగన్ ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ చేసి, శవరాజకీయాలు చేశారని ఆయన అన్నారు. అధికార దాహం కోసం ప్రజా ప్రతినిధులను డబ్బుతో లొబరుచుకుని రాజీనామాలు చేయించిన ఘనత జగన్‌దేనని వ్యాఖ్యానించారు. జగన్‌నను విమర్శిస్తే ఎమవుతుందోనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ఎర్రచందనం స్మగ్లర్లలో ముఖ్యమంత్రి అనుచరులు ఉన్నారని ఆయన పీలేరు రోడ్ షోలో ఆరోపించారు. మద్యం, ఇసుక, ఎర్రచందనం, మైనింగ్ మాఫియాలతో రాష్ట్రం అవినీతిమయమైందని ఆయన అన్నారు. ముప్పయి ఏళ్ల తెలుగుదేశం పాలనలో బంధుప్రీతికి తావు లేకుండా చూశామని ఆయన అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తేనే నీతవంతమైన పాలన వస్తుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+