తన కూతురుతో ఆడినందుకు వ్యక్తిని చంపిన తండ్రి

స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. వీరికి పిల్లలు లేరు. అయితే చుట్టుపక్కల ఉండే పిల్లలను వీరు ప్రేమగా చూసుకుంటారు. పిల్లలకు అప్పుడప్పుడు చాక్లెట్లు, మిఠాయిలు, బొమ్మలు తదితరాలు ఇస్తూ ప్రేమగా చూసుకుంటారు. విశ్రాంతి సమయంలో పిల్లలతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తారు.
అయితే వీరేంద్ర కుమార్ ఇంటి పక్కన ఉండే చోటే రామ్ అనే వ్యక్తి కూతురుతోనూ వీరేంద్ర కుమార్, ఆయన భార్య తరుచుగా ఆడుకుంటుంటారు. మంగళవారం ఉదయం వారితో తన కూతురు ఆడుకుంటుండగా చోటే రామ్ చూశాడు. ఆగ్రహం చెందిన చోటే రామ్ తన ఇంట్లో నుండి ఓ కొడవలి తీసుకు వచ్చి వీరేంద్ర కుమార్ తలపై బాదాడు. కొడవలితో పలుమార్లు కుమార్‌పై దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.
ఇది గమనించిన చుట్టుపక్కల వారు అతనిని దగ్గరలోని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించారు. అతను తీవ్రంగా గాయపడటంతో తీవ్రంగా రక్తస్రావం అయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇతని వయస్సు నలభై ఏళ్లు ఉంటాయి. అంతిమ సమాచారం అందే సమయానికి నిందితుడు అరెస్టు జరగలేదు. కాగా గతంలోనే చోటే రామ్ తన కూతురుతో ఆడటంపై వీరేంద్ర కుమార్, ఆయన భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.












Click it and Unblock the Notifications