హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రజల కోసం మారిపోయా, బర్త్‌ డే వేడుకలొద్దు: బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: రైతులు కష్టాలలో ఉన్న సమయంలో తనకు పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం ఇష్టం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ చెప్పారు. శుక్రవారం చంద్రబాబు జన్మదినం. అయితే ప్రస్తుతం రాష్ట్రం పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఇలాంటి సమయంలో వేడుకలు తనకు ఇష్టం లేదని చెప్పారు. పేదరికం లేని సమాజం కోసం తాను తాపత్రయపడుతున్నానని చెప్పారు.

పేదవారు, రైతుల కోసం తెలుగుదేశం పార్టీ, తాను నిరంతరం కృషి చేశాం, చేస్తున్నామని చెప్పారు. భారత దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంచడం తన లక్ష్యమని చెప్పారు. రాబోవు రోజుల్లో ప్రజలకు మరింత సేవ చేసే లక్ష్యంతో ముందుకు వెళతామని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదని, ఇలాంటి సంక్షోభాలను ముప్పయ్యేళ్లలో ఎన్నింటినో సమర్థవంతంగా ఎదుర్కొందని చెప్పారు.

తాను గతంలో దేశ రాజకీయాల్లోనే కీలక పాత్ర వహించానని చెప్పారు. తాము ధర్మ పోరాటం చేస్తున్నామని, అంతిమ పోరాటం ఎప్పుడు ధర్మానిదే ఉంటుందన్నారు. తాను తన స్వార్థం కోసం ఎప్పుడు అధికారంలో ఉండగా పని చేయలేదని చెప్పారు. ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందించాలనే ఉద్దేశ్యంతో పని చేశానని చెప్పారు. పేదల కోసం నిత్యం పోరాటం చేస్తామన్నారు. తాను క్రమశిక్షణతో కూడిన రాజకీయాలు చేశానని చెప్పారు.

ఎన్నిసార్లు ఇబ్బందులు వచ్చినా ఎప్పుడు కూడా విసుగు చెందలేదని చెప్పారు. తాను అధికారం కోసం కూడా ఎప్పుడూ తపించలేదన్నారు. ప్రజల కోసం తాను ఇప్పుడు పూర్తిగా మారిపోయిన వ్యక్తిని అని చెప్పారు. తాను ప్రవేశ పెట్టిన సంస్కరణలు పేదల కోసం ఉపయోగపడాలనే అన్నారు. అయితే కొన్నింటిలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటానని చెప్పారు. కాగా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు వద్దంటూ పార్టీ కార్యాలయం కూడా ప్రకటన విడుదల చేసింది.

English summary
TDP President Sri Nara Chandrababu Naidu today announced that there would be no birthday celebrations for him this year, his 63rd birth day. In a statement released at NTR Bhavan today the TDP president said that in view of the farmers distress due to drought, lack of remunerative prices for farm produce, loss of cultivable lands to SEZ, lack of jobs, livelihood options,and driven to starvation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X