జగన్ 'ఓదార్పు' తగ్గితే కాంగ్రెస్‌కు లబ్ధి: టిజి వెంకటేష్

ముఖ్యమంత్రి మార్పు కలలో కూడా జరగదన్నారు. ప్రస్తుతం కాంగ్రెసులో సిఎం రేసులో ఎవరూ లేరన్నారు. అసలు ముఖ్యమంత్రి పదవి కావాలని కాంగ్రెసు పార్టీలో కోరేవారు ఎవరూ కనబడటం లేదన్నారు. అలాంటప్పుడు ఆ ప్రశ్న ఎలా తలెత్తుతుందని చెప్పారు. ఏప్రిల్ 1వ తేదిన కొందరిని ఫూల్స్ చేయాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి మార్పు వదంతులను కొందరు ప్రచారంలో పెట్టారని టిజి వెంకటేష్ చెప్పారు.
కాగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాపథంలో ఎక్కడా ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని ప్రభుత్వ చీప్ విఫ్ గండ్ర వెంకట రమణా రెడ్డి వేరుగా అన్నారు. ఆయన గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రజలు తమ సమస్యలను వివరిస్తున్నారని, దీన్ని ప్రభుత్వాన్ని నిలదీయడంగా భావించడం చాలా పొరపాటు అని ఆయన చెప్పారు.
కాగా సీమాంధ్రకు చెందిన కాంగ్రెసు పార్టీ నేతలు కొందరు అంతర్గతంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తున్నారని వరంగల్ పార్లమెంటు సభ్యుడు రాజయ్య ఆరోపించారు. అధిష్టానం తక్షణమే జోక్యం చేసుకొని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. లేదంటే పార్టీ తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications