బాలుడి హత్య: రామరాజుకు యావజ్జీవ ఖైదు

రామరాజుకు యావజ్జీవ ఖైదు విధిస్తూు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఆర్ రాధా ఆదేశాలు జారీ చేశారు. రామరాజుకు విధించిన 60వేల రూపాయల జరిమానాలో బాలుడి తల్లికి నష్టపరిహారం కింద 50 వేల రూపాయలు చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
ఫోర్ట్ పోలీసు స్టేషన్ అధికారులున తొలుత దర్యాప్తు చేపట్టారు. తర్వాత కేసు దర్యాప్తును సిబి - సిఐడి తీసుకుంది. సిబిసిఐడి 2011 ఆగస్టులో చార్జిషీట్ దాఖలు చేసి రామరాజును కోర్టులో హాజరు పరిచింది.
సాక్ష్యాలను నాశనం చేయడానికి రామరాజు ప్రయత్నించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. తాను హెచ్చరించినప్పటికీ తన ప్రాంగణంలోకి బాలుడు చొరబడుతూ వచ్చాడని, దాంతో కోపంతో కాల్పులు జరిపానని రామరాజు చెప్పాడు. తీర్పు పట్ల బాలుడి తల్లి హర్షం వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications