అళగిరిపై పోరు: తప్పుకుంటానని స్టాలిన్ హెచ్చరిక

పాలక అన్నాడియంకె ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచినందుకు నిరసనగా ఏప్రిల్ 14వ తేదీన స్టాలిన్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు హాజరు కానందుకు జారీ అయిన షోకాజ్ నోటీసులకు వారంలోగా వివరణ ఇవ్వాలని అళగిరి మనుషులను ఆదేశించారు. అళిగిరి మనుషులపై చర్యలు తీసుకోకపోతే తాను పార్టీ కోశాధికారిగా తప్పుకుంటానని స్టాలిన్ హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీ మధురై ఆఫీస్ బియరర్లందరికీ ఈ నెల 17వ తేదీన షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఇది అళగిరి సొంత ప్రాంతం. ఒకప్పుడు అన్నాడియంకెకు కంచుకోట అయిన దక్షిణ తమిళనాడులో పార్టీని బలోపేతం చేయడంలో అళగిరి ప్రధాన పాత్ర పోషించారు. వారసత్వ పోరు పార్టీలో మొదటి నుంచీ ఉన్నదే.
దక్షిణ తమిళనాడులో అత్యంత బలంగా ఉన్న అళగిరి పార్టీలో మార్పులను వ్యతిరేకిస్తున్నారు. అవసరమైతే తాను పార్టీ నాయకత్వం కోసం పోటీ పడుతానని అళగిరి గతంలో అన్నారు. ఇరువురి పోరు మధ్య కరుణానిధి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications