వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుప్పకూలిన విమానం: వంద మందికి పైగా మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Pakistan Plane crash
హైదరాబాద్: పాకిస్తాన్‌లో శుక్రవారం సాయంత్రం ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ సమీపంలో ప్రయాణికులతో కూడిన విమానం కుప్పకూలింది. ఆ విమానం కోరల్ చౌక్ అనే గ్రామంలో కూలినట్లు పాకిస్తాన్ టెలివిజన్ చానెల్స్ తెలుపుతున్నాయి. విమానంలో దాదాపు 127 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వారంతా మరణించి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారిలో 118 మంది ప్రయాణికులు కాగా, తొమ్మిది మంది విమాన సిబ్బంది.

భోజ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కరాచీ నుంచి బయలుదేరి ఇస్లామాబాద్‌కు వస్తోంది. ఆ సమయంలో ప్రతికూల వాతావరణం వల్ల విమానం కూలినట్లు తెలుస్తోంది. విమాన ప్రమాదంతో 15 ఇళ్ల దాకా దగ్దమైనట్లు సమాచారం. ప్రతికూల వాతావరణం సహాయక చర్యలకు ఆటంకంగా మారినట్లు చెబుతున్నారు. విమానం కూలిన విషయాన్ని పాకిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది.

విమానం సాయంత్రం ఏడు గంటలకు ఇస్లామాబాద్ చేరుకోవాల్సి ఉండింది. ప్రయాణికులంతా మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. విమానం పూర్తిగా శిథిలమైనట్లు తెలుస్తోంది. సైన్యం సంఘటనా స్థలానికి చేరుకుంది. విమానాశ్రయానికి పది కిలోమీటర్ల దూరంలో రద్దీగా ఉండే ప్రాంతంలో విమానం కూలింది. విమానం మండుతున్న బంతిలాగా వచ్చి పడిందని అంటున్నారు. కూలడానికి ముందే విమానంలో మంటలు లేచినట్లు చెబుతున్నారు. ఇస్లామాబాద్‌లోని అన్ని ఆస్పత్రులను, రావల్పిండిలోని ఆస్పత్రులను అప్రమత్తం చేశారు.

2010 జులైలో ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ విమానం ఎయిర్‌బ్లూ కొండ ప్రాంతాల్లో కూలింది. ఇందులోని 152 మంది మరణించారు.

English summary
Over 127 people are feared dead as a private airline crashed ten kilometers short of Islamabad airport on Friday evening. The B-737-200 airplane operated by private carrier Bhoja Air was on its inaugural commercial flight from Karachi to Islamabad. Airport officials said that adverse weather conditions may have caused the crash. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X