ఐఐటి సీటు రాదనే భయంతో విద్యార్థి ఆత్మహత్య

ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన శశిమంత్ రెడ్డిగదా గుర్తించారు. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత అతను హైదరాబాదులోని ఎల్‌బి నగర్‌లో గల చైతన్య రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలోఐఐటి లాంగ్ టర్మ్ కోచింగుకు చేరాడు. ఇంటర్మీడియట్ పూర్తయిన వెంటనే నిరుడు ఓసారి అతను ఐఐటి జెఇఇ రాశాడు. అయితే సీటు రాలేదు.
ఐఐటి జెఇఇ ఫలితాలు మే 18వ తేదీన వెలువడనున్న నేపథ్యంలో శశిమంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇసాట్ - 2012 పరీక్ష కూడా సరిగా రాయలేదని, దీంతో శశిమంత్ రెడ్డి తీవ్ర మానసికాందోళనకు గురయ్యాడు మిత్రులు చెప్పినట్లు పోలీసులు అంటున్నారు.
శశిమంత్ రెడ్డి మరో ఇద్దరితో పాటు హాస్టల్ గదిలో ఉంటున్నారు. మిగతా ఇద్దరు రాత్రి ఎనిమిది గంటల సమయంలో భోజనానికి వెళ్లినప్పుడు శశిమంత్ రెడ్డి గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. రమ్మని అడిగితే తనకు ఆకలిగా లేదని అతను మిత్రులతో చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
సంఘటనా స్థలంలో పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. ఐఐటి - జెఇఇ సరిగా రాయకపోవడంతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అతను అందులో రాశాడు. శశిమంత్ రెడ్డి తండ్రి రాజీవ్ రెడ్డి మెకానికల్ ఇంజనీర్. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications