డిఎల్‌కు కౌంటరా: జగన్‌ను వదలని కిరణ్ కుమార్ రెడ్డి!

డిఎల్ వ్యాఖ్యల ప్రభావమో మరేమో కానీ ఆ తర్వాత నుండి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం జగన్ పైన విరుచుకు పడుతున్నారు. ప్రతి నియోజకవర్గం ప్రచార సభలోనూ, కార్యకర్తల సమావేశంలోనూ సిఎం రెండు రోజులుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేతనే ఆయన లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారు. అయితే జగన్ పైన కిరణ్ విమర్శనాస్త్రాలు సంధించినప్పటి నుండి కాంగ్రెసు కార్యకర్తలలో, నేతలలో కొత్స ఉత్సాహం కనిపిస్తోందని అంటున్నారు.
సోమవారం తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం ఉప ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి, తాను పార్టీ విషయంలో కొన్నిసార్లు తప్పు చేశానని వైయస్ ఓసారి చెప్పారని, కానీ ఎవరూ కూడా జీవితంలో అలాంటి పొరపాటు చేయవద్దని సూచించారని, ఆ సమావేశంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారని చెప్పారు. కానీ జగన్ మాత్రం తండ్రి మాటలు బేఖాతరు చేస్తూ కాంగ్రెసును నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వైయస్ మాటలను అతను ఎందుకు విస్మరించాడో తనకు అర్థం కావడం లేదన్నారు.
దివంగత వైయస్‌కు భిన్నంగా జగన్ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో కలిసి కాంగ్రెసు ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు కుయుక్తులు పన్నారన్నారు. టిడిపి అవిశ్వాసానికి జగన్ మద్దతిచ్చినందు వల్లే ఉప ఎన్నికలు వచ్చాయన్నారు. ప్రభుత్వాన్ని ఎందుకు కూలదోయాలనుకున్నారో చెప్పాలని జగన్‌ను కిరణ్ ప్రశ్నించారు.
జగన్ డెబ్బై గదుల ఇళ్లు కట్టుకున్నారని, ప్రజా నాయకుడికి ముఖ్యంగా సిఎం కావాలనుకుంటున్న వ్యక్తి అలాంటి ఇళ్లు కట్టుకొని ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. జగన్ మెంటాలిటీ నాకు అర్థం కావడం లేదన్నారు. అంతకుముందు రోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కిరణ్ ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చాలా రోజుల తర్వాత కిరణ్ వైయస్సార్ కాంగ్రెసు అధినేతపై విమర్శలు చేశారు.
కాంగ్రెసు ప్రభుత్వాన్ని కూల్చేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తాను చనిపోయేంత వరకు కాంగ్రెసు కోసం పాటుపడతానని చెప్పారన్నారు. కానీ ఆయన కడుపున పుట్టిన జగన్ మాత్రం అదే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. ఆ కుట్ర ఫలితమే ప్రస్తుత ఉప ఎన్నికలు అన్నారు. జగన్‌పై కిరణ్ చెలరేగటం చూస్తుంటే డిఎల్ కోవర్టు వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నట్లుగా కనిపిస్తోందంటున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications