టెక్కీ బాంబు తయారీ మిస్టరీపై పోలీసుల ఆరా

జగదీష్ బెంగళూర్‌లో ఓ కంప్యూటర్ సంస్థను నడుపుతున్నట్లు సమాచారం. అనతి భార్య కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. జగదీష్ వెనక ఎవరున్నారనే విషయాన్ని ఆరా తీయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన జగదీశ్ హైదరాబాద్‌లోని సరోజినీ దేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మావోయిస్టులకు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు షెల్టర్ జోన్‌గా ఉన్న రాజమండ్రిని బెంగుళూరుకు చెందిన జగదీశ్ బాంబు తయారీ కేంద్రంగా ఎంచుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.
నాటుబాంబులు, టైమర్లు , బ్యాటరీ వాచ్‌లు , పేలుడు పదార్దాలు ఒక్కరోజులో సమాకూర్చుకునేవి కాదు కాబట్టి.. ఈ కార్యకలాపాలకు ఎవరు సహకరించారనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. బాంబు పేలుడు సంభవించిన ఇల్లు జగదీశ్ బావ రామకృష్ణది కావడంతో పోలీసులు ఆయనను కూడా విచారిస్తున్నారు. ఉగ్రవాదులు , మావోయిస్టులుతో జగదీశ్‌కు ఏమైనా సంభందాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ సాగిస్తున్నారు.
ఈ కేసును అన్ని కోణాల్లో నుంచి పరిశీలన చేస్తున్నట్లు ఎస్పీ రవికుమార్ చెబుతున్నారు. వాల్ క్లాక్ లోపల టైం బాంబును అమర్చి, దాన్ని కంప్యూటర్‌కు కనెక్ట్ చేయబోతున్న సమయంలో పేలినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ క్లాక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టెక్కీ సెల్‌ఫోన్ కాల్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications