హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పేరుతో అల్లర్లు చేస్తే సంబంధం లేదు: జూపూడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Jupudi Prabhakar Rao
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరుతో ఎవరైనా అల్లర్లు చేస్తే పార్టీకి, జగన్‌కు సంబంధం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర రావు అన్నారు. వైయస్ జగన్ విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. మరో అరగంటలో జగన్ బయటకు వస్తారని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు, కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాలని ఆయన కోరారు.

తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని ఆయన సూచించారు. జగన్ గురించి తప్పు ప్రచారాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. హింసకు పథకం పన్నుతున్నారని తమ పార్టీ నాయకులను అరెస్టు చేస్తున్నారని ఆయన చెప్పారు. తప్పుడు కేసుల్లో తమ పార్టీ కార్యకర్తలను నిర్బంధిస్తున్నారని ఆయన అన్నారు. సనత్‌నగర్ నేత వెల్లాల రామ్మోహన్‌ను అక్రమంగా పోలీసులు అరెస్టు చేశారని ఆయన అన్నారు. తప్పు కథనాలతో ఎల్లో మీడియా ప్రచారం సాగిస్తోందని ఆయన అన్నారు.

తాము ఏ విధమైన అల్లర్లకు పథకం రచించలేదని జగన్ సేవాదళ్ నాయకుడు కోటంరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి చెప్పారు. తాము సంయమనం పాటించాలని, సహనం పాటించాలని మాత్రమే తాము మెసేజ్‌లు పంపించామని ఆయన చెప్పారు. అవసరమైతే తాను ఈ విషయాన్ని కోర్టులో నిరూపించగలనని ఆయన అన్నారు. తమను బెదిరించి, అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

సైబరాబాద్ పోలీసులు మియాపూర్‌లో ముగ్గురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యర్తలను అరెస్టు చేశారు. వైయస్ జగన్‌ను అరెస్టు చేస్తే వంద బస్సులను తగులబెట్టడానికి కుట్ర చేశారని సైబరాబాద్ ఇంచార్జీ కమిషనర్ రాజీవ్ రతన్ చెప్పారు. హైదరాబాదులోని సోమాజిగుడాలో కొంత మందిని అరెస్టు చేసినట్లు సమాచారం.

English summary
YSR Congress leader Jupudi Prabhakar Rao said that his party and party president YS Jagan will bot responsible if somebody reports to violence on the name of YS Jagan. He appealed to the workers to maintain peace.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X