వైయస్ మృతిపై అనుమానాలు: వైయస్ వివేకానంద

వైయస్ రాజశేఖర రెడ్డి మృతిపై వ్యక్తమవుతున్న అనుమానాలపై ప్రజల సందేహాలను తీర్చాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శించేవారు రాక్షుసులు, రాబందులు అని ఆయన అభివర్ణించారు. కాంగ్రెసు నుంచి చాలా మంది వెళ్లిపోయే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఉత్తరప్రదేశ్ పరిస్థితిలా తయారైందని ఆయన అన్నారు.
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు కేంద్ర పాలక మండలి సభ్యుడు పెన్మత్స సాంబశివరాజు అన్నారు. వైయస్ మృతి విషయంలో తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మపై, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి డిపాజిట్లు దక్కవనే బాధతోనే బొత్స సత్యనారాయణ స్థాయిని మరిచి విమర్శలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బొత్స సత్యనారాయణ తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications