హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరకాలకు: తెలంగాణలో అడుగిడనున్న విజయమ్మ!

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ తెలంగాణలో అడుగు పెట్టనున్నారు! ఉప ఎన్నికల నేపథ్యంలో వైయస్ విజయమ్మ ప్రచార షెడ్యూల్‌ను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శనివారం విడుదల చేసింది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 8వ తేదిన ఆమె వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గానికి ప్రచారం నిమిత్తం రానున్నారు.

వైయస్ విజయమ్మ మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొండా సురేఖకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. కాగా రెండేళ్ల క్రితం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేపట్టేందుకు వచ్చినప్పుడు మానుకోట వద్ద తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జగన్ వర్గీయులు, తెలంగాణవాదుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.

అప్పటి నుండి ఇప్పటి వరకు జగన్ తెలంగాణలో అడుగు పెట్టలేదు. రంగారెడ్డి జిల్లాలో, మెదక్ జిల్లాలో కుటుంబాలను పరామర్శించేందుకు మాత్రం వచ్చారు. కానీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టింది లేదు. వైయస్ జగన్మోహన్ రెడ్డి నేపథ్యంలో వైయస్ విజయమ్మ ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆమె పరకాల నియోజకవర్గ పర్యటన ఎలా ఉంటుందో అనే చర్చ ప్రారంభమైంది. ఇప్పటికే తాము విజయమ్మను అడ్డుకుంటామని తెలంగాణవాదులు ప్రకటించారని అంటున్నారు.

పరకాల ఉప ఎన్నికలలో కొండా సురేఖను అత్యంత మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ కొండా మురళీ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. తమ కుటుంబం కార్యకర్తలకు అండగా ఉండటమే తమ విజయానికి దోహదపడుతుందని అన్నారు.

English summary

 YSR Congress Party respectory president and Pulivendula MLA YS Vijayamma will tour in Parkal of Warangal district. She will campaign in 8th of this month. YSR Congress Party released YS Vijayamma campaign schedule on saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X