రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రపంచవ్యాప్తంగా...: ఎన్టీఆర్, వైయస్‌లపై చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
రాజమండ్రి: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ బాధ్యత లేని తల్లిగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం మండిపడ్డారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్ డబ్బులను ఖర్చు పెట్టి ప్రపంచంలో ఏదైనా చేయవచ్చునని భావిస్తున్నాడని, మీడియాకు, దేవుళ్లకు కూడా లంచాలు ఇస్తారని, అలాంటి వారిని విశ్వసిస్తే సమాజాన్ని భ్రష్టు పట్టిస్తారని విమర్శించారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కారణంగా ఐఏఎస్‌లు, పేరున్న పారిశ్రామికవేత్తలు జైళ్లకు వెళ్లారని, ఆ సమయంలో నోరు మెదపని వైయస్ విజయమ్మ నేడు కొడుకును జైల్లో పెట్టేటప్పటికి భర్త మరణాన్ని రాజకీయం చేస్తూ రోడ్డు పైకి వచ్చారన్నారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు పప్పులు, బెల్లాలు పెట్టి కొడుక్కి లక్షల కోట్లు పెట్టారన్నారు. ఇప్పుడు తల్లి విజయమ్మ జగన్‌కు ఏకంగా రాష్ట్రాన్నే కట్టబెట్టే ప్రయత్నాల్లో ఉన్నారని అన్నారు.

ఆమె కుతంత్రాన్ని ప్రజలు తిప్పి కొట్టాలని సూచించారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని, ఓ మంత్రి జైలుకు వెళితే, మరో మంత్రి నేరగాళ్లకు న్యాయమూర్తికి నడుమ బ్రోకరేజి చేస్తున్నారని, హోంమంత్రి ఇంట్లోనే భాను కిరణ్‌లాంటి నేరగాళ్లు కూర్చొని సెటిల్మెంట్లు చేస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రివర్గ సమావేశాలు చంచల్‌గూడ జైలులో జరిగినా ఆశ్చర్యపోనక్కర లేదన్నారు. గోదావరి జిల్లాల్లోనే రైతులు ఆనందంగా లేరంటే ఈ ప్రభుత్వానికి సిగ్గుందా అని ప్రశ్నించారు.

ముందుచూపు లేని ప్రభుత్వ వైఖరి కారణంగా విద్యుత్తు కోతలతో ప్రజలు అల్లాడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి కీర్తిని చాటితే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం తెలుగువారిని దొంగలుగా నిలబెట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తారు. కాంగ్రెసు పార్టీ వైరు జైళ్లలో ఉన్నారని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వాళ్లూ జైళ్లలోనే ఉన్నారని, రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారన్నారు.

చివరకు న్యాయవ్యవస్థకే కళంకం తెచ్చారన్నారు. ఈ పరిస్థితుల్లో జగన్లో ఉన్న పార్టీకి ఓటేస్తారో జైళ్లలో ఉన్న పార్టీలకు ఓటేస్తారో ప్రజలే తీర్పు చెప్పాలన్నారు. ఉప ఎన్నికలలో పాల్గొంటున్న ఎమ్మెల్యేలకు ప్యాకేజీలు ఇస్తున్నారని, ప్యాకేజీల ప్రభావం ఎక్కువగా ఉందని, ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అవినీతి ప్రక్షాళనకు కాంగ్రెసు ఇన్నాళ్లుగా చేసిందేమీ లేదని, కోర్టులు ఆదేశిస్తే గానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu praised late Nandamuri Taraka Rama Rao and blaed late YS Rajasekhar Reddy for their activities. Chandrababu Naidu lashed out at CM Kiran Kumar Reddy government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X