జగన్ నిర్ణయించుకున్నారు, కాబట్టే: నార్కో టెస్టులపై వర్ల

నార్కో టెస్టులు చేస్తే నిజం చెబుతానన్న భయముందా అన్నారు. సిబిఐ విచారణకు జగన్ సహకరించడం లేదు కాబట్టి నార్కో పరీక్షలు తప్పనిసరి అన్నారు. తప్పు చేయకుంటే పరీక్షలకు స్వచ్ఛందంగా అంగీకరించాలని అన్నారు. ప్రత్యేక విమానాలలో ఢిల్లీ నుండి లాయర్లను పిలిపించుకునే బదులు నార్కో పరీక్ష ఎదుర్కొనేందుకు సిద్ధపడితే బావుంటుందన్నారు. వేల కోట్లు కొట్టేసిన ఘరానా దొంగలకు కోర్టులు మినహాయింపులు ఇవ్వడం సరికాదన్నారు.
ప్రజా ధనాన్ని లూటీ చేసిన వివరాలు బయటకు తెప్పించేందుకు జగన్‌కు పరీక్షలు చేయడానికి అనుమతివ్వాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వైయస్ జగన్ తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడి కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు.
ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ అన్ని స్థానాలలో గెలుపొందుతుందని మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించారు. యాజమాన్యం వైఫల్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ఆయన మండిపడ్డారు. కార్మికులకు భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications