చిరుపై టిడిపి కుట్ర, విజయమ్మ కన్నీటి ఓట్లు: లగడపాటి

ఉప ఎన్నికల ఫలితాలు ముందు ఊహించినట్లే ఉన్నాయని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాయి అడుగంటిందని, ఆ పార్టీ భవిష్యత్తులో దారుణమైన స్థితికి చేరుకుంటుందని ఆయన అన్నారు. మున్ముందు కాంగ్రెసు పార్టీకి ప్రతిపక్షం వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. విజయమ్మ కన్నీటి వల్లనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆయన అన్నారు.
సానుభూతి వల్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టకి ఓట్లు వచ్చాయని, సానుభూతి పాలపొంగు లాంటిదని, ఒక్కసారి మాత్రమే పనిచేస్తుందని, మళ్లీ మళ్లీ పనిచేయదని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అరెస్టు కాకపోతే ఆ పార్టీకి 8 సీట్లు మాత్రమే వచ్చేవని ఆయన అన్నారు.
ఉప ఎన్నికల ఫలితాలపై విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సర్వే నిజమయింది. మూడు రోజుల క్రితం లగడపాటి ఉప ఎన్నికల ఫలితాలపై తాను సర్వే చేశానని, చెబుతూ తన అంచనాలను ఫలితాల విడుదలకు ముందు చెప్పారు. ఈ ఉప ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి వస్తాయని, ఆ పార్టీకి 12 నుంచి 16 సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు. వైయస్ జగన్ అన్ని అస్త్రాలను ఈ ఎన్నికల్లో వాడడం, తాము కాస్తా ఆలస్యంగా ఎదురుదాడికి పూనుకోవడం అందుకు కారణమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications