ఎయిర్ ఇండియా పైలట్ల 57 రోజుల సమ్మె విరమణ

సమ్మె విరమించాలని ఢిల్లీ హైకోర్టు ఎయిర్ ఇండియా పైలట్లను ఆదేశించింది. తిరిగి పనిలో చేరుతామని పైలట్లు అండర్‌టేకింగ్ ఇచ్చారు. సమ్మె సందర్భంగా తొలగించిన పైలట్లను తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకునే విషయంపై యాజమాన్యం సానుభూతితో వ్యవహరించాలని హైకోర్టు సూచించింది. సమ్మె కాలంలో వివిధ కారణాలతో విధులకు గైర్హాజరైన పైలట్లను యాజమాన్యం ఉద్యోగాల నుంచి తలొగించింది.
ఎయిర్ ఇండియాకు చెందిన 434 మంది పైలట్లు కూడా తిరిగి ఉద్యోగం చేరడానికి సుముఖత వ్యక్తం చేశారు. పైలట్ల డిమాండ్లను పరిశీలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉద్వాసనకు గురైన వంద మంది పైలట్లను, ఇండియన్ పైలట్స్ గిల్డ్ నాయకులు పది మందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని పైలట్లు డిమాండ్ చేస్తున్నారు.
పైలట్ల డిమాండ్‌ను సానుభూతితో పరిశీలిస్తామని ఎయిర్ ఇండియా హైకోర్టుకు హామీ ఇచ్చింది. పై డిమాండ్‌తో పాటు మిగతా డిమాండ్లను కేంద్ర ముఖ్య కార్మిక కమిషనర్ పరిశీలిస్తారు. శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు మొదటి సంప్రదింపుల సమావేశం జరుగుతుంది. పైలట్ల 57 రోజుల సమ్మె వల్ల ఎయిర్ ఇండియాకు భారీ నష్టం వాటిల్లింది.












Click it and Unblock the Notifications