నేపాల్‌లో చిక్కుకున్న హైదరాబాదీలు, కూలిన వంతెన

శుక్రవారం నాడు జీపు మార్గం ద్వారా ముక్తిధామం యాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా జాన్స్‌న్ - కోక్రా మార్గంలో బ్రిడ్జి కూలడంతో వారు అక్కడే చిక్కుకుపోయారు. వారి సెల్‌ఫోన్లు కూడా స్విచాఫ్ అవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
శుక్రవారం సాయంత్రం నుంచి వారు అందుబాటులో లేరని, నేపాల్ ప్రభుత్వానికి సమాచారం అందించినా పట్టించుకోవడం లేదని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తపరిచారు. హెలికాఫ్టర్ పంపించి తమ వారిని క్షేమంగా తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.












Click it and Unblock the Notifications