అనంతలో హత్య, కాంగ్రెసు నేతపై టిడిపై నేత దాడి

Anantapur District
అనంతపురం/ నిజామాబాద్/తిరుపతి : అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం దుయ్యాలకుంట సమీపంలో శనివారం ఉదయం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వ్యక్తి చంపిన దుండగులు ఆపై పెట్రోల్ పోసి శవాన్ని తగుల బెట్టారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు.

అదే జిల్లాలోని బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లిలో మరోసారి పాతకక్షలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ నాయకుడు రామాంజనేయులును తెలుగుదేశం నేత వెంకటేశ్వర్లు స్కార్పియో వాహనంతో ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి న రామాంజనేయులును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన కాంగ్రెస్ కార్యకర్తలు వెంకటేశ్వర్లు ఇంటిపై దాడికి పాల్పడ్డారు.

తిరుపతిలో రెండు నెలల క్రితం అదృశ్యమైన బాలుడి ఆచూకి శనివారం ఉదయం లభ్యమైంది. గుంటూరులోని మల్లేశ్వరమ్మ అనే మహిళ వద్ద ఆర్‌పీఎఫ్ పోలీసులు బాలుడి ఆచూకీని గుర్తించారు. బాలుడిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదిలావుంటే, నిజామాబాద్ జిల్లాలో తమ సోదరిని వేధిస్తున్న బావను మరుదులే మట్టుపెట్టిన సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర రెడ్డి తన భార్య కొండమ్మను తరుచుగా వేధింపులకు గురి చేయసాగాడు. వారం రోజుల క్రితం ఆమెతో వెంకటేశ్వర రెడ్డి గొడవ పడడం ఆమె సోదరులకు తెలిసింది.

దాంతో ఆగ్రహించిన కొండమ్మ సోదరులు, మరి కొంత మందితో కలిసి వెంకటేశ్వర రెడ్డిపై కత్తులు, కర్రతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర రెడ్డిని స్థానికులు నిజామాబాద్ తరలిస్తుండగా అడ్డుకుని మరోసారి దాడి చేశారు. దీంతో అక్కడికక్కడే మరణించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+