హైటెక్ సిటీ మాత్రమే హైదరాబాద్ కాదు: సిఎం

kiran kumar reddy
హైదరాబాద్: హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ మాత్రమే హైదరాబాద్ నగరం కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శేరిలింగంపల్లిలో ఆయన ఇందిరమ్మ బాటలో భాగంగా శనివారం రాజీవ్ గాంధీ ఆవాస్ యోజన పథకానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాదులో 1400 మురికివాడలు ఉన్నట్లు గుర్తించామని, వాటిని 9 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. శేరిలింగంపల్లిలో క్రీడామైదానాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఓ క్రీడా మైదానం ఏర్పాటు చేయనునన్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 11 పట్టణాల్లో రాజీవ్ ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. దశలవారీగా హైదరాబాదును అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు.

తక్కువ ఖర్చుతో వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ వైద్య విధానంలో మార్పులు తెస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాదులోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో ట్రామ్‌కేర్ విభాగాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. రూ. 176 కోట్లతో భవనాలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా చేసే శస్త్రచికిత్సలు, ఇతర చికిత్సలో 40 శాతం వాటాను ప్రభుత్వాస్పత్రులకు మళ్లిస్తామని ఆయన చెప్పారు.

మూడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌ను ఆన్‌లైన్ ద్వారా అనుసంధానం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 108 సర్వీసులకు ట్రాకింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు వైద్యవిద్య శాఖ మంత్రి కొండ్రు మురళి కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.

నిమ్స్‌లో ఏర్పాటు చేసిన అత్యవసర విభాగం ద్వారా 500 పడకలు, 14 ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి వచ్చాయని కొండ్రు మురళి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దానం నాగేందర్, పార్థసారథి, ముఖేష్ గౌడ్, శైలజానాథ్ తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత నిమ్స్ పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల నూతన భవనానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+