కోస్తా జిల్లాలకు సైకో సాంబ టెన్షన్, వేట ముమ్మరం

సైకో సాంబ ఈ నెల 12వ తేదీన కొండపల్లి ఖిల్లా అటవీ ప్రాంతంలో పోలీసుల కళ్లు గప్పి అతను పారిపోయాడు. కొండపల్లి ఖిల్లాను చుట్టుముట్టి గాలింపు జరిపినా అతని జాడ పోలీసులకు చిక్కలేదు. అతను ఖమ్మం జిల్లా సరిహద్దులోని ఓ గ్రామంలో కనిపించాడంటూ ఇటీవల దుమారం రేగింది. ఆ తర్వాత ఈ నెల 16వ తేదీన విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ముక్కలుగా నరికి సంచీలో పెట్టిన శవం సాంబదేనంటూ పుకార్లు చెలరేగాయి.
శరీర అవయవాలను జాగ్రత్తగా పరిశీలించి, ఫోరెన్సిక్ పరీక్షలు చేయించిన పోలీసులు అది సాంబ శవం కాదని నిర్ధారించారు. సాంబ ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించాడనే సమాచారం అందడంతో కొండపల్లి ఖిల్లా ప్రాంతంలో నామమాత్రంగా బలగాలను ఉంచి, ఇతర ప్రాంతాల్లో గాలిస్తున్నారు. ఖమ్మం, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల్లో అతని కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. మంగళగిరిలో పట్టుబడడానికి సాంబ జాడ తెలిపిన వ్యక్తి ఇప్పుడు భయంతో వణికిపోతున్నాడని అంటున్నారు.
ఇదిలావుంటే, సాంబ పారిపోయినందుకు బాధ్యులైన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేందుకు సంసిద్ధమవుతున్నారు. కొండపల్లి ప్రాంతంలో ఓ చోట తాను సొమ్మును దాచానని చెప్పడంతో పోలీసులు అక్కడ సోదాలు ప్రారంభించిన సమయంలో అతన పారిపోయాడు. సైకోను కొండపల్లి కొండల ప్రాంతానికి తీసుకు వెళ్లినప్పుడు అతని చేతిలకు బేడీలు వేశారు. అతని వెంట ఇద్దరు ఎస్ఐలు, ఇద్దరు సిఐలు, పదిమంది కానిస్టేబుల్స్ ఉన్నారు. అయితే ఈ సైకో వారి కళ్లు గప్పి పారిపోయాడు. కొండపల్లి ఖిల్లాలో పోలీసులు సొమ్ము కోసం చూస్తుండగా అతను వారి నుండి తప్పించుకొని పారిపోయాడు.












Click it and Unblock the Notifications