కేంద్రంలో పొత్తు, బెంగాల్‌లో ఒంటరిగానే పోతాం: దీదీ

తమకు గౌరవం ఉన్నంత వరకు యుపిఎలో కొనసాగుతామని, తమ ఆత్మగౌరవరం దెబ్బ తింటే మాత్రం బయటకు వస్తామని ఆమె చెప్పారు. తాను రఫ్ అండ్ టఫ్ అడ్మినిస్ట్రేటర్‌ని అని ఆమె చెప్పుకున్నారు. ఢిల్లీ పాలకులు తమ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తే అధికారాన్ని లాక్కుంటామని ఆమె అన్నారు.
మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో తమ పార్టీ బలపడుతోందని ఆమె చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆమె చెప్పారు. ఎవరి దయాదాక్షిణ్యాల మీదనో తాము అధికారంలోకి రాలేదని, కాంగ్రెసు దయాదాక్షిణ్యాల మీద అంతకన్నా కాదని ఆమె అన్నారు. తాము కాంగ్రెసుతో కలిసి ఉండాలని భావిస్తున్నామని, అయితే తమపై కాంగ్రెసు పార్టీ విమర్శలు చేస్తోందని ఆమె అన్నారు.
కాంగ్రెసు దాడిని తాము సహించబోమని, తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆమె చెప్పారు. తమ హక్కులను ఢిల్లీ పాలకుల నుంచి సాధించుకోవడం ఎలాగో తమకు తెలుసునని ఆమె అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు పెంచడానికి తమకు నిధులు కావాలని ఆమె అన్నారు. ర్యాలీకి తృణమూల్ కాంగ్రెసు కాంగ్రెసు పార్టీని ఆహ్వానించలేదు.












Click it and Unblock the Notifications