హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌పై భక్తితో డేటా సేకరణ: సిఐడికి చిక్కిన కెవి రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

CBI JD Laxmi Narayana
హైదరాబాద్: సిబిఐ జాయింట్ డైరెక్టర్ (జెడి) లక్ష్మినారాయణ కాల్ డేటా రికార్డు (సిడిఆర్) లీకు కేసులో నేర పరిశోధక విభాగం (సిఐడి) ప్రగతి సాధించింది. ఈ కేసులో సిఐడి అధికారులు ఇంద్ భారత్ ఎనర్జీస్ (మహారాష్ట్ర) వైస్ ప్రెసిడెంట్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో ఇదే తొలి అరెస్టు కావడం గమనార్హం. కేసులో ప్రధాన నిందితుడు రఘురామరాజుకు అత్యంత సన్నిహితుడైన ఇంద్ భారత్ ఎనర్జీస్ వైస్ ప్రెసిడెంట్ కె. వెంకా రెడ్డిని అరెస్టు చేసినట్లు సిఐడి అధికారులు చెప్పారు. ఈ కంపెనీ రఘురామ రాజుకు చెందిందే.

కుట్ర, ఇతర ఆరోపణలతో సిఐడి అధికారులు ఆయనను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ఓ నిందితుడి ప్రోద్బలంతో తాను నేరాకికి పాల్పడినట్లు వెంకారెడ్డి అంగీకరించినట్లు సిఐడి అధికారులు చెప్పారు. అధికారి ఫోన్ నెంబర్ వాడి సిబిఐ జెడి లక్ష్మినారాయణ సిడిఆర్‌ను పొందాడనే ఆరోపణపై వెంకారెడ్డిని అరెస్టు చేశారు. పైగా, ఆ వ్యవహారాన్ని కప్పి పుచ్చే ప్రయత్న చేశాడని అధికారులు అంటున్నారు.

లక్ష్మినారాయణ కాల్ డేటా రికార్డు సంపాదించడానికి వెంకా రెడ్డి పెద్ద నాటకమే ఆడినట్లు తెలుస్తోంది. తనకు ఓ నెంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ మహారాష్ట్రలో వెంకా రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ నెంబర్ సిబిఐ జెడిదనే విషయం అతను పోలీసులకు చెప్పలేదు.

పోలీసులకు చేసిన ఫిర్యాదుతో, ఇతర తప్పుడు పత్రాలతో కాల్ డేటా రికార్డు కావాలంటూ వెంకా రెడ్డి బిఎస్ఎన్ఎల్ డిప్యూటీ డైరెక్టర్ కె. హనుమంతరావును సంప్రదించాడు. కాగా, హనుమంతరావు కూడా సిఐడి అధికారులకు చిక్కడం లేదు. వెంకారెడ్డికి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. లక్ష్మినారాయణ కాల్ డేటా రికార్డు లీకుపై సిఐడి అధికారులు ఇప్పటికే వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

రఘురామరాజుకు సన్నిహితుడైన కె వెంకా రెడ్డికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తోనూ సత్సంబంధాలున్నాయి. వెంకా రెడ్డికి గతంలో బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించడంలో జగన్ సాయం చేసినట్లు వెల్లడయింది. రఘురామరాజు కోరడం వల్ల, జగన్‌ను ఇబ్బంది పెడుతున్న లక్ష్మినారాయణను ఇరుకున పడేయాలనుకోవడం వల్ల వెంకారెడ్డి ఈ పని చేసినట్లు భావిస్తున్నారు.

English summary
Crime Investigation Department (CID) officials on Wednesday made the first breakthrough in CBI joint director VV Lakshminarayana's call data record (CDR) leak case by arresting Ind Bharath Energies (Maharashtra) vice-president here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X