హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజీనామా ఏది: కిరణ్‌కు పార్థసారథి చిక్కు, అక్షింతలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy-Parthasarathi
న్యూఢిల్లీ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెసు పార్టీ అధిష్టానం అక్షింతలు వేసింది. మంత్రి పార్థసారథి కేసు విషయమై హైకమాండ్ కిరణ్ కుమార్ రెడ్డి వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. మంత్రి పార్థసారథిచే రాజీనామా చేయించాలని ఢిల్లీ పెద్దలు కిరణ్‌ను గురువారం ఆదేశించారు. కేంద్రంలోనే అవినీతి ఆరోపణలు వచ్చిన మంత్రులచే రాజీనామా చేయిస్తుంటే రాష్ట్రంలో మాత్రం ఎందుకు మౌనంగా ఉంటున్నారని కిరణ్‌ను ప్రశ్నించింది.

ఆరోపణలు ఎదుర్కొని కోర్టు కేసులో నేరస్తుడిగా నిర్ధారణ అయిన పార్థసారథిని వెంటనే కేబినెట్ నుండి తొలగించాలని, ఇప్పటి వరకు ఈ కేసు విషయమై తమ దృష్టికి ఎందుకు తీసుకు రాలేదని కిరణ్ పైన అధినాయకులు మండిపడ్డారని తెలుస్తోంది. కిరణ్‌కు అధిష్టానం అక్షింతల నేపథ్యంలో పార్థసారథి ఏ క్షణంలోనైనా తన మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాగా మంత్రి పార్థసారథి ఫెరా నిబంధనలను ఉల్లంఘించినట్లుగా బుధవారం ఆర్థిక నేరాల కోర్టు నిర్ధారించిన విషయం తెలిసిందే. గతంలో తన కంపెనీ మిషనరీ కొనుగోలు విషయంలో ఫెరా నిబంధనలు ఉల్లంఘించినట్లుగా పార్థసారథిపై అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో మంత్రి ఆర్థిక నేరాల కోర్టులో హాజరయ్యారు. విచారణ జరిపిన కోర్టు మంత్రి నేరం చేసినట్లుగా బుధవారం నిర్ధారించింది.

కోర్టు ఆయనకు రూ.5లక్షల 15వేల జరిమానాతో పాటు రెండు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. ఫెరా ఉల్లంఘన కేసులో కెపిఆర్ సంస్థను మొదటి నిందితుడిగా పేర్కొంటూ సంస్థకు రూ.5 లక్షలు, పార్థసారథిని రెండో నిందితుడిగా పేర్కొంటూ అతనికి రూ.5 వేల జరిమానా విధించింది. మరో కేసులో రూ.10వేల జరిమానా విధించింది. జరిమానా కట్టని పక్షంలో మరో పది నెలలు జైలు శిక్ష విధించింది.

అయితే తాత్కాలికంగా జైలు శిక్షను నిలుపుదల చేస్తూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా ఈ బెయిల్ మంజూరు చేసింది. ఇందుకోసం ఓ నెల రోజులు గడువు కూడా ఇచ్చింది. ఇందుకుగాను మంత్రి పూచికత్తు కోర్టుకు సమర్పించారు.

English summary
Chief Minister Kiran Kumar Reddy facing minister Parthasarathi trouble now. Congress party high command took class to CM on minister case issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X