కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సైకోగా మారాలా అన్న ఎమ్మెల్యే: కాల్చేయాలన్న డిఎల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy - MLA Rajesh
కడప/గుంటూరు: మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి, చింతలపూడి శాసనసభ్యుడు రాజేష్ మంగళవారం వేర్వేరుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డిఎల్ రవీంద్రా రెడ్డి మంగళవారం మైదుకూరులో జరిగిన వన సంరక్షణ సమితి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడార. అడవులు తరిగిపోతే వర్షాలు సరిగా పడవని అన్నారు. తమ సమీపంలోని అడవులను కాపాడుకోవడంలో ప్రజలే కీలక పాత్ర వహించాలని సూచించారు.

అటవీ సంరక్షణకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకు వచ్చినా ప్రజలలో మాత్రం మార్పు కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ సంరక్షణ కోసం ఎన్ని చట్టాలు ఉన్నాయన్నారు. వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. ఎర్ర చందనం దొంగలను కనిపిస్తే కాల్చి పారేయాలని, అప్పుడే వారి ఆగడాలను అరికట్టగలమని అన్నారు. కొందరు పెద్దల అండదండలతో అటవీ దొంగలకు అందలం దక్కుతోందని ధ్వజమెత్తారు.

మరోవైపు గుంటూరు జిల్లా చింతలపూడి శాసనసభ్యుడు రాజేష్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే రాజేష్ మంగళవారం అధికారుల తీరుపై మండిపడ్డారు. అధికారులు పని చేయడం లేదని ఆరోపించారు. వారితో పని చేయించుకోవాలంటే తాము కూడా సైకో సాంబశివ రావు లాగా మారాలా అని ప్రశ్నించారు. సైకోలాగా కత్తులు, బ్లేడులతో తిరిగి పనులు చేయించుకోవాలేమే అని అన్నారు.

కాగా చెట్లు నరికేసి పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలిగిస్తున్న వారిని ప్రజలు నిలదీయాలని మంత్రి ధర్మాన ప్రసాద రావు శ్రీకాకుళం జిల్లాలో పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత అని, వన సంరక్షణపై ప్రజలలో చైతన్యం పెరగాలని అభిప్రాయపడ్డారు. ప్రాణవాయువు అందించి, వర్షాలు కురిపించే చెట్లను నిర్లక్ష్యం చేస్తే మానవ మనుగడకే ప్రమాదమన్నారు.

English summary
Minister DL Ravindra Reddy and MLA Rajesh make controversial comments on Tuesday on different issues in different districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X