ఏలూరులో 12, 13 తేదీల్లో వైయస్ విజయమ్మ ధర్నా

ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకాన్ని ఆపే ఆలోచన రాష్ట్రప్రభుత్వానికి ఉంటే తక్షణం పునరాలోచన చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ప్రతిభకు పేదరికం ఆడ్డు కాకూడదనే ఆశయంతో వైయస్ రాజశేఖర రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఈ పథకాన్ని ఆపేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తప్పవని ఆయన అన్నారు.
సుప్రీంకోర్టు తీర్పును కుంటిసాకుగా చూపి ప్రభుత్వం ఫీజు రీయంబర్స్‌మెంట్ విషయంలో అసాధారణ నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు తిరగబడాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి రోజా పిలుపునిచ్చారు. ప్రజల తిరుగుబాటుకు విద్యార్థుల తరఫున తమ పార్టీ అండగా నిలుస్తుందని ఆమె చెప్పారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ కేంద్ర మండలి సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి శనివారం ప్రారంభించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దివంగత నేత వైయస్ విగ్రహానికి వారు నివాళులు అర్పించారు. కమలాపురి కాలనీలో పార్టీ సేవాదళం రాష్ట్ర కన్వీనర్ కోటంరెడ్డి వినయ్ రెడ్డి ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications