జగన్ మీడియాపై హైకోర్టు ఆగ్రహం, 3 లక్షల జరిమానా

ఈ మొత్తాన్ని వారం రోజుల్లోగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ మూడు సంస్థలకు చెందిన బ్యాంకు ఖాతాలను సిబిఐ ఇటీవల స్తంభింప చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ బ్యాంక్ ఖాతాల స్తంభన ఆదేశాలు సవరించాలంటూ ఈ సంస్థలు ఆయా పిటిషన్‌లలో పదే పదే సవరణలు కోరుతుండటంపై హైకోర్టు మండిపడింది. పిటిషన్‌లు దాఖలు చేస్తూ పదే పదే సవరణలు కోరుతూ మళ్లీ పిటిషన్‌లు దాఖలు చేయడమేమిటని ప్రశ్నించింది. దీనిపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసి ఆ సంస్థలకు జరిమానా విధించింది.
కాగా అక్రమాస్తుల కేసులో వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ రెండు నెలల క్రితం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతకముందే సిబిఐ జగన్ మీడియా ఆస్తులను అటాచ్‌మెంట్‌కు, ఆయా కంపెనీల బ్యాంక్ అకౌంట్ల స్తంభనకు కోర్టు నుండి, ప్రభుత్వం నుండి అనుమతి తీసుకుంది. అనంతరం ఆ అకౌంట్లను సిబిఐ జప్తు చేసింది. జగన్ మీడియా సంస్థలు కోర్టుకు వెళ్లి అకౌంట్ల స్తంభనలో కొన్ని వెసులుబాటులు పొందాయి.












Click it and Unblock the Notifications