రాజ్యసభకు గ్లామర్: సచిన్, రేఖలకు ప్రణబ్ పాఠాలు

రాజ్యసభలో బుధవారం రేఖ, సచిన్ టెండుల్కర్‌లే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. చెక్ షర్ట్ ధరించిన సచిన్ సతీమణి అంజలితో కలిసి పార్లమెంటుకు వచ్చారు. ఆయన సభలోకి అడుగు పెట్టగానే మిగతా ఎంపీలంతా ఆయన వైపు ఆసక్తిగా తిరిగి చూశారు. బంగారు రంగు జరీ, గులాబి రంగు అంచుల క్రీమ్ కలర్ చీరలో రేఖ మెరిసి అందరినీ ఆకట్టుకుంది. వీరిద్దరికీ మిగతా సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
అను ఆగా, జావెద్ అక్తర్‌ల మధ్యనున్న 99వ నెంబరు సీటులో రేఖ, టికె రంగరాజన్ పక్కన ఉన్న 103వ నెంబరు సీటులో సచిన్ కూర్చున్నారు. సభ ముగిశాక వారిద్దరి ఫోటోలు తీసేందుక మీడియా ఎగబడింది. దీంతో అక్కడ కాసేపు గందరగోళం ఏర్పడింది. ఇది తనకు ఓ కొత్త అనుభవమని ఈ సందర్భంగా సచిన్ అన్నారు.












Click it and Unblock the Notifications