జెడి కాల్‌లిస్ట్: హైకోర్టులో కెవిపి బంధువు రివ్యూ పిటిషన్

కాగా అంతకుముందు హైకోర్టులో వేసిన తన పిటిషన్‌ను రఘురామ రాజు బుధవారం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. దీనిపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రఘురామ రాజు ఇటీవల హైకోర్టులో అప్పీల్ చేశారు. లీకేజీ వ్యవహారంలో జెడి లక్ష్మీ నారాయణ ఫిర్యాదుతో హైదరాబాదు సిసిఎస్ పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టి వేయాలని అభ్యర్థిస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారించిన సింగిల్ జడ్జి భావు ఆ పిటిషన్‌ను కొట్టి వేశారు. దీన్ని సవాల్ చేస్తూ రఘురామ రాజు అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తీర్పుపై మళ్లీ పిటిషన్ దాఖలు చేస్తానని, ఉపసంహరణకు అనుమతివ్వాలని అభ్యర్థించారు. దీన్ని పరిశీలించిన కోర్టు ఉపసంహరణకు అనుమతించింది. ఉపసంహరించుకున్న రఘురామ రాజు గురువారం మళ్లీ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.
మరోవైపు ఈ కేసులో నిందితులైన రఘురామ రాజు, హనుమంతరావు, రమణారావు, శాస్త్రి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు ఈ నెల 14కి వాయిదా పడింది. నాలుగో అదనపు మెట్రోపాలిటన్ కోర్టులో గురువారం వాదనలు జరిగాయి.












Click it and Unblock the Notifications