మోసం చేస్తున్నాడని అన్నా హజారేపై ఫిర్యాదు

ఈ నెల 14వ తేదీన తన ఫిర్యాదుపై కోర్టు విచారణ జరుపుతుందని భాటియా మీడియా ప్రతినిధులతో చెప్పారు రాజకీయ పార్టీకి ప్రాతిపదికను తయారు చేసుకోవడానికి ప్రజలను అన్నా హజారే, ఆయన బృందం తప్పు దోవ పట్టించారని, మద్దతు ఇచ్చిన లక్షలాది మంది ప్రజలను విశ్వాసంలోకి తీసుకోకుండా అర్థాంతరంగా ఆందోళనను విరమించారని న్యాయవాది ఆరోపించారు.
అన్నా బృందం భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని, వాటి వివరాలను వెల్లడించలేదని ఆయన ఆరోపించారు. బాబా రామ్‌దేవ్‌ను కూడా భాటియా నిందించారు. అన్నా హజారే ఉద్యమాన్ని దారి మళ్లించేందుకు రామ్‌దేవ్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేస్తూ రామ్‌దేవ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
అన్నా హజారే బృందం ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగి విరమించిన విషయం తెలిసిందే. తాము రాజకీయ పార్టీని పెడతామని, లోక్‌పాల్ బిల్లు కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోమని చెప్పింది. పార్టీకి ఏర్పాటుకు తగిన ఏర్పాట్లు కూడా అన్నా హజారే బృందం చేసుకుంటోంది. ఇదిలావుంటే, రామ్‌దేవ్ బాబా ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు.












Click it and Unblock the Notifications