ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య: కందా మోస్ట్ వాంటెడ్

కందా ఆత్మహత్యకు ప్రేరేపించిట్లు గీతిక తన నోట్‌లో ఎక్కడా చెప్పలేదని కందా తరఫు న్యాయవాది కెటిఎస్ తులసి వాదించారు. బుధవారం నుంచి కందా ఆచూకీ దొరకడం లేదు. తమ ముందు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తనకు మరింత సమయం కావాలని కందా కోరారు. అందుకు పోలీసులు నిరాకరించారు. అప్పటి నుంచి ఆయన జాడ లభించడం లేదు.
గీతిక ఆత్మహత్య కేసులో పోలీసులు ఇప్పటికే ఎండిఎల్ఆర్ మేనేజర్ అరుణా చద్దాను అరెస్టు చేశారు. గీతిక ఆత్మహత్య నేపథ్యంలో హర్యానా హోంశాఖ సహాయ మంత్రి గోపాల్ కందా ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. గతంలో ఆయన నిర్వహించిన విమానయాన సంస్థలో ఎయిర్ హోస్టెస్‌గా పని చేసిన ఇరవై మూడేళ్ల గీతికా శర్మ శనివారం రాత్రి ఢిల్లీలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గోపాల్ మానసిక వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె లేఖ రాసింది. మృతురాలి సోదరుడు కూడా గోపాల్ వైపే వేలు చూపించారు.
లేఖ ఆధారంగా ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా గోపాల్ పైన ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన తన పదవికి ఆదివారం రాత్రి రాజీనామా చేశారు. ఎండిఎల్ఆర్ అనే విమానయాన సంస్థను నడిపిన గోపాల్ కందా 2009 శాసనసభ ఎన్నికల్లో సిర్సా నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. హుడా ప్రభుత్వంలో హోం, పురాపాలక, పరిశ్రమలు, వాణిజ్య వ్వవహారాల సహాయమంత్రిగా పని చేస్తున్నారు. ఎండిఎల్ఆర్ విమానయాన సంస్థ మూతపడిన తర్వాత అందులో ఎయిర్ హోస్టెస్‌గా పని చేసే గీతికకు గోపాల్ మరో అనుబంధ సంస్థలో అవకాశం ఇచ్చారు.
ఇటీవలె ఆమె ఎంబిఏ చదివేందుకు ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. గీతిక సోదరుడు విలేకరులతో మాట్లాడుతూ.. తన సోదరి గీతిక కొంతకాలం ఎండిఎల్ఆర్‌ను వీడి దుబాయ్‌లో మరో విమానయాన సంస్థలో చేరిందని, ఆమె వ్యక్తిత్వంపై ఆరోపణలు చేస్తూ గోపాల్ దుబాయి సంస్థకు లేఖ రాయడంతో ఆమెను ఉద్యోగం నుండి తొలగించారని తెలిపారు.












Click it and Unblock the Notifications