జూలై 2న రేవతి నక్షత్రంలోకి శని.. ఈ రాశులవారికి హెచ్చరిక!
వేద జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. గ్రహాలు ఒక రాశి నుండి మరో రాశిలోకి సంచారం చేయటంతో పాటు, ఒక నక్షత్రం నుండి మరో నక్షత్రానికి సంచారం చేస్తాయి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ ఏడాది జూలై 2వ తేదీన శని దేవుడు రేవతి నక్షత్రం రెండో పాదంలోకి ప్రవేశించనున్నాడు.
రేవతి నక్షత్రంలోకి శనిదేవుడు
రేవతి నక్షత్రం రెండవ పాదంలోకి శనిదేవుడి సంచారం కొన్ని రాశుల వారి జీవితంలో ముఖ్యమైన మార్పులను తీసుకురావచ్చని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మేషం, వృషభం, సింహం, తుల రాశుల వారు ఈ కాలంలో మరింత జాగ్రత్తగా, ఓర్పుగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. శని దేవుడు న్యాయాధికారి, కర్మఫలాలను ఇచ్చే గ్రహం, క్రమశిక్షణకు మారుపేరు అయిన దేవుడు కావడంతో ఆయన ప్రతి చిన్న మార్పు కూడా దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది.

రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం
రేవతి నక్షత్రం ముగింపు మరియు కొత్త ప్రారంభాలకు కూడా సంకేతంగా పరిగణింపబడుతుంది. ఈ నక్షత్రం రెండో పాదంలో శని ప్రవేశించడం వల్ల గత కర్మల ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
మేష రాశి
మేషరాశి జాతకులకు ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో వీరు ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం లేదు . అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. ఈ సమయంలో మేషరాశి జాతకులు ఏ పని చేసినా ఆచి తూచి నిర్ణయం తీసుకుంటే మంచిది.
వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు పెరగవచ్చు. కుటుంబంలో చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఈ సమయంలో వృషభ రాశి వారు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
సింహ రాశి
సింహరాశి వారికి వ్యాపారం లేదా ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేముందు బాగా ఆలోచించాలి. ఈ సమయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకుంటే మంచిది . సహోద్యోగులతో సమన్వయం ఉంచుకోవడం మంచిది.ఓర్పు, క్రమశిక్షణ, బాధ్యతలు పాటిస్తే శని అనుగ్రహం లభిస్తుందని వారు చెబుతున్నారు.
తుల రాశి
తుల రాశి జాతకులకు వ్యక్తిగత సంబంధాలు, ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. ఈ సమయంలో తులారాశి జాతకులు కుటుంబ సభ్యులతో మృదువుగా మాట్లాడాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ కాలం కష్టాలు ఎదురైనా వాటిని అవకాశాలుగా మార్చుకోవాలని, జాగ్రత్తగా వ్యవహరించాలని సలహా ఇస్తున్నారు.
గమనిక: ఈ జ్యోతిష్య ఫలితాలు సాధారణమైనవి కావడంతో వ్యక్తిగత జాతకం ప్రకారం నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.













Click it and Unblock the Notifications