అది వారి వ్యక్తిగతం: దానం, సబిత గొడవపై బొత్స

ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. నామినేటెడ్ పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రతిపక్షాల ఆందోళనలు ఉన్నాయని, స్వలాభం కోసమే ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి మాటలను ఎవరూ నమ్మబోరని ఆయన అన్నారు.
సంక్షేమ పథకాలపై తమ ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం విద్యార్థుల మనుగడ, అభివృద్ధికి కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు వ్యవహరించాలని ఆయన సూచించారు. తమ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు రాజకీయ పార్టీలు చేస్తున్న ఆందోళనల్లో విద్యార్థులు పాలుపంచుకుని భవిష్యత్తును పాడు చేసుకోవద్దని ఆయన సూచించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ విధానాన్ని మారుస్తున్నట్లు, ఎత్తివేస్తున్నట్లు ప్రతిపక్షాలకు ఎవరు చెప్పారని ఆయన ప్రశ్నించారు. ఫీజులు పెంచాలని అడుగుతున్న ప్రైవేట్ కళాశాలలను ఫీజులు తగ్గించాలని ఎందుకు అడగడం లేదని ఆయన ప్రశ్నించారు.
వాన్‌పిక్ భూముల విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అందులో దుక్కి దున్నడం ఏమిటని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లాలోని వాన్‌పిక్ భూముల్లో చంద్రబాబు శుక్రవారం ట్రాక్టర్‌తో దుక్కి దున్నిన విషయం తెలిసిందే.
ఫీజు రీయంబర్స్‌మెంట్‌లో కోతను బొత్స సత్యనారాయణ కూడా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆ విషయంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్చించి సూచనలు చేయాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని ఆదేశించారు. ఉప సంఘం మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. శుక్రవారం ఏ నిర్ణయం తీసుకోకుండా సమావేశం వాయిదా పడింది.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications