కెవిపి, ధర్మాన గూడుపుఠాణి: జగన్‌పార్టీ నేత సంచలనం

KVP Ramachandra Rao - Dharmana Prasad Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గొర్లె హరి బాబు గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వాన్ పిక్ కేటాయింపులలో మంత్రి ధర్మాన ప్రసాద రావు, రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెసు పార్టీ నేత కెవిపి రామచంద్ర రావు గూడుపుఠాణీ చేశారని ఆయన మండిపడ్డారు. వాన్ పిక్ భూముల కేటాయింపులో వారిద్దరు కలిసి కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో తీసుకున్న నిర్ణయాలు అన్ని మంత్రివర్గం సమష్టి నిర్ణయాలు అన్నారు.

మంత్రి ధర్మాన ప్రసాద రావు వల్ల శ్రీకాకుళం జిల్లాకు అపఖ్యాతి వస్తోందన్నారు. వైయస్ హయాంలో మంత్రులు చేసిన అవినీతిని దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పైకి నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ధర్మాన ప్రసాద రావు ఆస్తులపై సిబిఐ విచారణ జరిపిస్తే నిజాలు మొత్తం వెలుగులోకి వస్తాయన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే ఆయనపై విచారణ జరిపించాలని గొర్లె హరి బాబు అన్నారు.

ఏ ఒక్కరినో టార్గెట్ చేసుకోవడం సరికాదన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. జగన్‌కు ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేదని, అనవసరంగా జైలులో పెట్టారన్నారు. కాగా వైయస్సార్ కాంగ్రెసు కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో వాన్ పిక్ వ్యవహారంపై ఇటీవల సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ ఛార్జీషీటులో మంత్రి ధర్మాన ప్రసాద రావు పేరును కూడా సిబిఐ పేర్కొంది. దీంతో ధర్మాన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పంపించారు. అయితే రాజీనామా చేయవద్దని ధర్మానపై ముఖ్యమంత్రి సహా పలువురు ఒత్తిడి తీసుకు వస్తున్నారు. ఆయన రాజీనామా చేసి మూడు రోజులు అయినప్పటికీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గానీ, గవర్నర్ గానీ దానిని ఆమోదించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+