• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

క్రికెట్ కోసం కాదు, వస్తాయి పోతుంటాయి: కిరణ్ బౌన్సర్

By Srinivas
|

Kiran Kumar Reddy
హైదరాబాద్: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం ఘాటుగా స్పందించారు. కిరణ్ ఇందిర బాట పేరుతో ఆటలాడుకుంటున్నారని, అతనిని ఒలింపిక్స్‌కు పంపిస్తే పతకాలు వచ్చేవని నారాయణ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై కిరణ్ బౌన్సర్ వేశారు. తాను గిరిజన వసతు గృహాల్లో క్రికెట్ అడుతోంది, అక్కడే భోజనాలు తింటున్నది వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకే తప్ప మరెందుకో కాదని అన్నారు.

తాను చేసేది సినిమానో నటనో కాదని, గిరిజన గ్రామాల, విద్యార్థుల అభివృద్దికి కృషి చేస్తున్నానని చెప్పారు. గిరిజన వసతి గృహాల్లో ఆటలాడేందుకు నిద్ర చేయడం లేదని, సిఎంతో సమానంగా గిరిజనులు ఎదగాలి అన్నదే తన ఉద్దేశ్యమని, ఈ విషయంలో ఎవరేమనుకున్నా పట్టించుకోనని, మీడియా, మరెవరు విమర్శించినా భయపడనని అన్నారు. హాస్టల్స్‌లో నిద్ర నటన కాదని, సినిమా కానే కాదని, అటువంటి దుస్థితి తనకు లేదన్నారు.

గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు... ఇప్పటికే అమలు లో ఉన్న 'పునాది'లో భాగంగా రూపొందించిన 'క్వెస్ట్' (క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఎస్టీస్) కార్యక్రమాన్ని గురువారం రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం ఆవిష్కరించారు. తాను చేపట్టిన 'ఇందిరమ్మ బాట' గురించి ప్రస్తావించారు. "సీఎం గ్రామాల్లో, హాస్టళ్లలో నిద్రిస్తున్నారంటే ఎందుకు వచ్చారు? అనే ఆలోచన ఆ ప్రాంత వాసుల్లో వస్తుంది. తమ బాగు కోసమే వచ్చారని వారు గుర్తిస్తారు. ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకుని ఎదిగేందుకు ప్రయత్నిస్తారు.

గిరిజనులు కూడా సీఎంతో సమానమేనన్న భావన కల్పించేందుకే నా తాపత్రయం'' అని కిరణ్ అన్నారు. ఈ సందర్భంగా కొంత వేదాంత ధోరణి ప్రదర్శించారు. "ఆస్తి, ఉద్యోగం రావచ్చు, పోవచ్చు. సీఎం, మంత్రి పదవులూ శాశ్వతం కాదు. చదువు ఒక్కటే శాశ్వతం. అది జీవితాంతం వెంట ఉంటుంది'' అన్నారు. గిరిజన విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తే.. వారు మరెవ్వరికీ తీసిపోరనే నమ్మకం తనకుందన్నారు.

గత సంవత్సరం ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల ల్లో శిక్షణ పొందిన వంద మంది విద్యార్థుల్లో 18 మందికి ఐఐటీ సీట్లు ల భించాయని, 5500మందికి కార్పొరేట్ కళాశాలల్లో శిక్షణనిప్పిస్తే ఇద్దరు మాత్రమే సీట్లు పొందారని అన్నారు. గిరిజనులకు, మారుమూల ప్రాం తాల్లో ఉండే వారి ఉన్నత విద్యాభాస్యం కోసం మెరుగైన, మరిన్ని శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని కిరణ్ ప్రకటించారు.

గిరిజనులకు సంబంధించి పురుషుల్లో 47 శాతం, మహిళల్లో 27 శాతం మాత్రమే అక్షరాస్యత ఉందని... ఇలా అయితే ఎలా అభివృద్ధి సాధిస్తారని కిరణ్ ప్రశ్నిస్తారు. "అందరూ చదువు కోవడమే కాదు. నాణ్యమైన విద్యను పొందగలగాలి. అందుకోసమే పునాది - క్వెస్ట్ వంటివి చేపట్టాం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం దేశంలోనే తొలిసారి'' అని చెప్పారు. "మీ జీవితానికి మీరే బాటలు వేసుకోండి. భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారో ముందే లక్ష్యాన్ని ఎంచుకోండి.

ప్రభుత్వపరంగా అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తాం'' అని సీఎం హామీ ఇచ్చా రు. గిరిజనులు, మైనారిటీలు, మత్స్యకారులు నివసించే ప్రాంతాల్లో ప్రతి వంద కుటుంబాలకు ఒక వలంటీర్‌ను నియమించి, స్కూలు డ్రాపవుట్‌లను నిరోధించే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు.

ఆరు నెలల్లో అన్ని నియామకాలు... గిరిజన ప్రాంతాల్లోని అన్ని శాఖల్లో ఆరు నెలల్లో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని సీఎం కిరణ్ తెలిపారు. ఇటీవల ప్రకటించిన గిరిజన డిక్లరేషన్‌లో భాగంగా గిరిజన వసతి గృహాలకు ప్రత్యేకంగా ప్రకటించిన 104 సర్వీసు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. 2700 టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో పాఠశాలల నిర్మాణానికి రూ. 125 కోట్ల నాబార్డు నిధులు మంజూరు చేశామని తెలిపారు.

English summary
CM Kiran Kumar Reddy said that he is not playing cricket and other games in Indira Bata for enjoy. He said he is playing with student to encourage them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X