బాబుకు షాక్: వంటేరు వేణుగోపాల్ రెడ్డి రాజీనామా

తెలుగుదేశం పార్టీ తీరుపై ఆయన తీవ్ర విమర్శలు చేసారు. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని స్థానిక నాయకత్వం భ్రష్టు పట్టిస్తోందని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ నేతలు తనను మోసం చేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెసుతో బహిరంగంగా తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయిందని ఆయన అన్నారు
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జిల్లాకు వచ్చినా మార్పు రాలేదని ఆయన అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడి తీరు తనకు నచ్చలేదని ఆయన అన్నారు. అందుకే రాజీనామా చేయదలుచుకున్నానని ఆయన అన్నారు.
ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరదలుచుకోలేదని, ఇంటికే పరిమితమై సొంత పనులు చూసుకుంటానని ఆయన అన్నారు. కాగా, వంటేరు రాజీనామా విషయం తనకు తెలియదని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రెండు రోజుల క్రితం తాను వంటేరుతో మాట్లాడానని, రాజీనామా చేసే ఆలోచన లేదని చెప్పారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications