ఊడితే ఊడనివ్వండి, అవే నాకు మైనస్!: బొత్స డీలా?

అదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలన పైన కూడా ఆయన తన సన్నిహితులతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ప్రభుత్వ పాలన గాడిన పడకపోవడం, పథకాల అమలులో పార్టీ కార్యకర్తలను భాగస్వామ్యులను చేయక పోవడం వంటి అంశాలు తనకు ప్రతికూలంగా మారాయని ఆయన అభిప్రాయపడుతున్నారట. రాష్ట్రంలో పాలన చూస్తుంటే సిగ్గేస్తోందని, గతంలో ఎన్నడూ లేని విధంగా కరెంట్ కొరత ఏర్పడి ప్రజలు రోడ్డెక్కుతున్నారని, ప్రజాప్రతినిధులను, పార్టీ నేతలను విమర్శిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
చర్యలపై ప్రశ్నిస్తే ప్రభుత్వ పెద్దల అంగీకారం లేదని చెబుతుంటారని, ముందు చూపులేని కారణంగానే సమస్య వచ్చిందని కిరణ్ కుమార్ రెడ్డి ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారట. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎనిమిదేళ్లు కరవు ఉందని, కానీ అప్పుడు కరెంట్ కోత ఉత్పన్నం కాలేదని, ఇప్పుడు ముందు చూపు లేని కారణంగానే కొరత ఏర్పడిందని చెబుతున్నారట.












Click it and Unblock the Notifications