రాజధాని ట్రైన్‌కు తప్పిన ముప్పు, అదే లైన్‌లో దురంతో

అదే సమయంలో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు బ్రేకులు ఆటోమేటిక్‌గా ఫెయిలయ్యాయి. దీంతో అది కూడా రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయింది. దగ్గర్లోని మరో స్టేషన్‌లో దురంతో నిలిచిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు ఆదోని రైల్వే స్టేషన్‌లో మరమ్మతులు చేపట్టారు. రైల్వే అధికారులు వెంటనే స్పందించి దురంతోను మరో స్టేషన్‌లో నిలపక పోయి ఉంటే భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేదని చెబుతూ ప్రయాణీకులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనకు కారణంపై రైల్వే అధికారులు వెంటనే విచారణ చేపట్టారు. రెడ్ సిగ్నల్ పడినా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైల్వే డ్రైవర్ రైలును ముందుకు తీసుకు వెళ్లాడని ప్రాథమిక విచారణలో తేలడంతో రైల్వే అధికారులు వెంటనే అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు. డ్రైవర్ పైన చర్యలు తీసుకున్నట్లు రైల్వే సిపిఆర్వో తెలిపారు.












Click it and Unblock the Notifications